![]() |
![]() |
.webp)
'కార్తీకదీపం' సీరియల్ స్టార్ మా టీవి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంగళవారం జరిగిన ఎపిసోడ్-1558 లో హిమ, శౌర్యలు పడిపోతుండగా కార్తీక్ వచ్చి ఇద్దరిని పట్టుకుంటాడు. ఇద్దరూ కార్తీక్ ని చూసి ఎమోషనల్ అవుతారు. ఏడుస్తారు.. కార్తీక్ ఇద్దరిని ఎత్తుకొని ఏడుస్తాడు. "డాడీ ఎక్కడున్నావ్? ఎన్ని రోజులుగా వెతుకుతున్నామో తెలుసా డాడీ" అని హిమ అడుగుతుంది. "అమ్మ ఎక్కడ డాడీ" అంటూ ఇద్దరు అడుగుతారు. "మీరు మొన్న నాకు కన్పించారు. నేను పిలుస్తూ మీ వెనకే వచ్చాను. మీరు చూడలేదా నాన్న" అని హిమ అంటుంది. "హిమ చెప్పినా.. నేను నమ్మలేదు నాన్న. మీరు చూసే తప్పించుకొని తిరుగుతున్నారా నాన్న. మమ్మల్ని అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి నాన్న" అని ఇద్దరు అడుగుతారు. "మీరు వెళ్ళండమ్మా.. అమ్మని మీ దగ్గరికి తీసుకొస్తాను" అని కార్తిక్ చెప్తాడు. "తప్పకుండా వెళ్తాం. కానీ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి" అని హిమ అంటుంది.
సౌందర్యని చేయి పట్టుకొని తీసుకొస్తుంది దీప. "మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమ్మా.. నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళు" అని దీపతో అంటుంది సౌందర్య. అంతలోనే దీప, సౌందర్య ఇద్దరు ఒకవైపు, కార్తీక్, హిమ, శౌర్యలు మరొకవైపు.. ఇలా ఒకరికొకరు ఎదురు పడుతారు. సౌందర్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కార్తీక్ ని పట్టుకొని ఏడుస్తుంది సౌందర్య. "ఎక్కడికెళ్లావ్ పెద్దోడా.. మాకు దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు. మీరు మాతో కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంత కాలం ఈ సంతోషం మాకెందుకు దూరం చేశారు" అని సౌందర్య అంటుంది. "మమ్మల్ని వదిలి మళ్ళీ వెళ్ళిపోతారా?" అని కార్తీక్ ని గట్టిగ పట్టుకొని ఉంటుంది హిమ. "లేదమ్మా.. ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు. మీతోనే" అని కార్తిక్ చెప్తాడు. "ఒకసారి మా స్థానంలో ఉండి చూడండి. మీకు దూరంగా ఉండి ఎంత నరకం అనుభవిస్తున్నామో తెలుస్తుంది. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అంతా నాకు తెలియాలి" అని సౌందర్య అంటుంది. అందరూ కలసి కార్తిక్, దీపలు ఉండే ఇంటికి బయల్దేరి వస్తుంటారు.
మరోవైపు కార్తీక్, దీప ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటికి మోనిత వస్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి, ఆ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తుంది. తినడానికి ఏమైనా ఉందా అని ఇల్లంతా చూసి దోశలు వేసుకుంటుంది.
అప్పుడే కార్తీక్, దీప, సౌందర్య, హిమ, శౌర్యలు వాళ్ళింటికి వస్తారు. తాళం పగులగొట్టడం గమనిస్తాడు కార్తీక్. "తాళం ఎవరు తీశారు" అని అంటూ అందరూ లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్లేసరికి దోశ తింటున్న మోనితని చూసి షాక్ అవుతారు. "ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావ్ వెళ్ళు" అని దీప అంటుంది. "నా కొడుకు కోడలు మాకు దూరంగా ఉండడానికి కారణం నువ్వేనా?" అని సౌందర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |